తెలంగాణ ఆరోగ్య శాఖ సంచలన నిర్ణయం.. వారందరికీ సెలవులు రద్దు

-

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తసుకుంది. అంతేకాదు.. రాబోయే 4 వారాలు కూడా సెలవులు రద్దు చేస్తూ… వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది.

రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డీహెచ్‌ శ్రీనివాస్‌ రావు.

అంతేకాదు…కరోనా పై డిహెచ్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో నిన్నటి రోజు పది లక్షల కేసులు నమోదు అయ్యాయని.. యూకే లో మొత్తం మూడు లక్షల కేసులు నమోదు అయినట్లు వివరించారు. ఇక ఇండియాలో మూడో వేవ్ స్టార్ట్ అయ్యిందని…నిన్న ఒక్కరోజే 50 వేల కేసులు నమోదు అయ్యాయని హెచ్చరించారు శ్రీనివాసరావు. దేశంలో 15 రాష్టాల్లో మూడోవేవ్ స్టార్ట్ అయ్యింది. ఢిల్లీలో ఒక్క రోజే 10 వేల కేసులు నమోదు అయినట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news