బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నాడు… ఉద్యోగులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదు- బండి సంజయ్

-

బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని… ఉద్యోగులకు న్యాయం చేసేదాకా పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశాడు. కేసీఆర్ ను వదిలిపెట్టమని, కేసీఆర్ జైలుకు పోవడం పక్కా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే అని.. అప్పుడు ఉద్యోెగులను ఖచ్చితంగా సొంత ప్రాంతాలకు పంపిస్తామన హామీ ఇచ్చారు. కొంతమంది సంఘాల నాయకులు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ.. మీకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నిరుద్యోగులు.. యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుంటే.. వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని.. వారందరిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం నలుగురు వ్యక్తులు మరణించడానికి కారణమైన ఎమ్మెల్యే కుమారుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర కాళయముడిగా మారారని.. పలు కుటుంబాలు ఆయన వల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని.. ఒకరి భార్యను రమ్మంటూ అరాచకాలకు పాల్పడుతున్నాడని.. అలాంటి వాడిపై టీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు బండి సంజయ్. ఎమ్మెల్యేను ఆయన కొడుకును రక్షించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news