బండి సంజయ్ ఒక శక్తి.. తట్టుకోలేరు : రాజా సింగ్ వార్నింగ్‌

-

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక శక్తి..తట్టుకోలేరని.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ 8 వ నిజామని.. 7వ నిజాం మెడలు వంచింది గుజరాత్ బిడ్డనేనని గుర్తు చేశారు. బండి సంజయ్ మొదటి సారి జైలు కు వెళ్ళలేదు… సమాజం కోసం జైలు కు వెళ్లేందుకు సిద్దమన్నారు. సీఎం కేసీఆర్‌ జులుం ను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. బండి సంజయ్ ఒక శక్తి… శక్తి ని ఎంత ఆపాలని అనుకున్న ఆగదన్నారు.

అన్ని సర్వేల్లో సీఎం గ్రాఫ్ తగ్గుతుందని వస్తుందని.. సీఎం కు చెబుతున్న మాతో పెట్టుకుంటే మట్టి లో కలవాల్సిందేనని హెచ్చరించారు. 317 జీఓ తో ఉద్యోగ, ఉపాధ్యాయులను సీఎం ఇబ్బంది పెడుతున్నారని… వరి కొనలేదు కానీ సిగ్గులేకుండా రైతు సంబరాలు చేస్తున్నాడని ఆగ్రహించారు. రైతు సంబరాలు చేస్తుంటే డీజీపీ ఎందుకు అరెస్ట్ చేయలేదని…సీఎం ద్వంద నీతి తో వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. సీటు ను కాపాడుకోవడమే ఆయన తాపత్రయమని… సోషల్ మీడియా లో బీజేపీ కి సపోర్ట్ చేస్తున్న వారిని అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు నిద్ర పోమని…..కేసీఆర్‌ తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news