కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువతిని దారుణంగా హత్య చేశాడు. ప్రియుడే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మానకొండూర్ మండలం చెంజెర్ల శివారులోని గుట్టల్లో యువతి వరలక్ష్మీ మృతదేహాన్ని కనుక్కున్నారు. పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి వెళ్లాడు. ప్రియుడు అఖిల్, వరలక్ష్మీని మూడు రోజుల క్రితం దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంతలో పడేసినట్లుగా తెలుస్తోంది. చనిపోయి మూడు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది.
అఖిల్.. వరలక్ష్మీని ప్రేమించాడు. అయితే గతంలో కొన్ని సార్లు వీరి ప్రేమ వివాదంపై కొన్ని సార్లు పంచాయతీలు కూడా జరిగాయని తెలుస్తోంది. పెళ్లికి ఒప్పుకోనందునే.. సదరు యువతిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. గత వారం నుంచి వరలక్ష్మీ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ హ్యండ్ బ్యాగ్ లో తనపై అత్యాచారం చేశాడని.. మోసం చేశాడని లేఖ దొరికినట్లు సమాచారం. అయితే అఖిల్ ఒక్కడే చంపాడా.. ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.