చాలామంది అజీర్తి సమస్యలతో బాధపడతారు. అజీర్తి సమస్యలు కలగకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ పెట్టాలి. అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే కాన్స్టిపేషన్, డయేరియా వంటి సమస్యలు ఉండవు.
అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే దీనికి గల కారణం ఏమిటంటే ఇవి ప్రోబయోటిక్స్ ఫుడ్స్. వీటిని తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే జీర్ణ సమస్యలు ఉండవు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ సూపర్ ఫుడ్స్ గురించి చూసేద్దాం.
పెరుగు:
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న సంగతి అందరికీ తెలుసు. రెగ్యులర్ గా పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇడ్లీ:
ఇడ్లీ కూడా చాలా మంచిది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా అజీర్తి సమస్యలు ఉండవు. అలాగే దోస, ఢోక్లా, ఉతప్పం లాంటివి కూడా చేసుకోవచ్చు.
కిమ్చి:
ఇది కూడా అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
పన్నీర్:
పన్నీర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కూడా అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. అంతే కాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాన్స్టిపేషన్ వంటి సమస్యలు లేకుండా ఇది చూసుకుంటుంది. అలానే బఠాణీ కూడా అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. బట్టర్ మిల్క్ తో కూడా అజీర్తి సమస్యలు తొలగించుకోవచ్చు. కనుక జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు వీటిని డైట్ లో చేర్చుకోండి దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. సమస్యలు లేకుండా ఉండొచ్చు.