యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బూర్గుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బూర్గుపల్లి సమీపంలో వ్యవసాయ బావి వద్ద ఓ ప్రేమ జంట ఉరేసుకుని.. ఆత్మహత్య చేసుకుంది. బూర్గుపల్లికి చెందిన మాడిశెట్టి అఖిల, సాయి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబాకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు వారి ద్దరిని మందలించారు. అప్పటికీ ఇంట్లో ఒప్పించాలని ఇద్దరూ భావించారు. కానీ.. ఫలితం లేదు.
మరొకరి తో బతకడం కంటే చావడం ఉత్తమమని.. వారిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. శాశ్వతంగా కలిసి జీవించడం కష్టమని భావించిన ఇరువురు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన వారిద్దరు ఇవాళ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్ల స్థానికులు చెబుతున్నారు. చెట్టుకు వేలాడుతున్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.