అత్యంత విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్యం..హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ !

-

ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. నిన్న కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో గాయని లతా మంగేష్కర్ ను ముంబై లోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కు ఆమె కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం గాయని లతా మంగేష్కర్ ను ఐసీయూలో ఉంచారు. అయితే… తాజాగా గాయని లతా మంగేష్కర్ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు.

” గాయకురాలు లతా మంగేష్కర్ ICU వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె మరో 10-12 రోజుల పాటు ఐసీయూలోనే ఉంటుంది. ఆమె కోవిడ్‌తో పాటు, న్యుమోనియాతో కూడా బాధపడుతోంది. ఆమెను మంచి వైద్యం అందిస్తున్నాం” అని బ్రీచ్ కాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సంధాని చెప్పారు. ఇక అటు గాయని లతా మంగేష్కర్ మేనకోడలు రచన.. కూడా ఆమె ఆరోగ్యం పై స్పందించారు. ”లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. ఎవరు కూడా కంగారు పడొద్దు. ఆమె వయస్సు పెద్దది కనుక.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే… ఐసీయూలో ఉంచారు” అంటూ వెల్లడించింది రచన.

Read more RELATED
Recommended to you

Latest news