రూట్ మారుస్తున్న రేవంత్..బాబుని ఫాలో అవుతారా?

-

ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. అసలు ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయ్యాయి. ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉంది..కానీ ఇప్పుడే ఎన్నికలు ఉన్నట్లు అక్కడ రాజకీయం నడుస్తోంది. పైగా అధికార వైసీపీ బలంగా ఉండటంతో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నాయని చెప్పి…ఇప్పుడు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసేస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులని పెట్టేశారు. ఇక వారే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పేశారు. ఒకవేళ ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే వారిని పక్కన పెట్టేస్తానని చెబుతున్నారు. ఇక ఇప్పటినుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేయడం వల్ల పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే అసంతృప్తి నేతలు ఉంటే ఇప్పుడే బయటపడిపోతారు. దాని వల్ల ఎన్నికల్లోపు డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు.

సరిగా బాబు రూట్‌లో తెలంగాణలో రేవంత్ రెడ్డి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారానికి దూరమైంది. ఈ సారి మాత్రం అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం. అందుకే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు. సొంత పార్టీలో ఎన్ని లుకలుకలు ఉన్నా సరే తన పోరాటాన్ని ఆపడం లేదు. అలాగే మరోవైపు బీజేపీ దూకుడుగా ఉన్నా సరే, బీజేపీకి ధీటుగా కాంగ్రెస్‌ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు.

ఇదే సమయంలో తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికల గురించి టాపిక్ వస్తుంది. దీంతో ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులని పెట్టడమే లక్ష్యంగా రేవంత్ ముందుకెళ్లనున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఫిక్స్ చేస్తే, అసంతృప్తి జ్వాలలు ఎక్కువ వస్తాయి. అప్పుడు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అందుకే ఇప్పటినుంచే రేవంత్ అభ్యర్ధులని ఫిక్స్ చేసే పనిలో ఉంటారని తెలుస్తోంది. అధిష్టానాన్ని ఒప్పించి పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేయాలని చూస్తున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news