తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వడగండ్ల వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల తీవ్రంగా నష్ట పోయారు. దీంతో సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. వర్షం వల్ల నష్ట పోయిన రైతులను సీఎం కేసీఆర్ నేరుగా కలిసి మాట్లాడాలని అనుకున్నారు. అందుకోసం వరంగల్ జిల్లాలో పర్యటించాలని అనుకున్నారు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రద్దు అయిందని సీఎంవో అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర వ్యవసాయ అధికారులు వరంగల్ జిల్లాలో వర్షం కారణంగా నష్ట పోయిన రైతులను నేరుగా కలిసి మాట్లాడనున్నారు. అలాగే వడగండ్ల వర్షంతో నష్ట పోయిన పంట వివరాలను కూడా నమోదు చేసి ఒక నివేదిక తయారు చేయనున్నారు.