ఆత్మను మాట్లాడించడం..ఆత్మ భాషను అర్థం చేసుకోవడం అన్నవి సాధ్యమా! ఊహకు సంబంధించిన విషయాలే కానీ ఒకవేళ అలాంటివే సాధ్యం అయితే ఈ లోకం విడిచి వెళ్లిన వారంతా మళ్లీ అక్కడి నుంచి దిగివచ్చి మనందరితో మాట్లాడి వెళ్లరూ! పోనీ అందరూ కాకపోయినా కొందరయినా ఈ లోకంపై ఉన్న ప్రేమను విడువక ఇటుగా వచ్చి మనతో మాట్లాడి వెళ్లరూ! ఇవన్నీ ఊహలను మనకు తెలుసు. కానీ చెబుతున్న వారిని మనం ఏమీ అనలేం..ఎవరి నమ్మకాలు వారివి కనుక అలా విని వదిలేయడం మినహా మనం ఇప్పటికిప్పుడు ఒకరి నమ్మకాలకు శాస్త్రీయ నిరూపణలు అయితే ఇవ్వలేం. ఆ విధంగా ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని ప్రార్థించడం తప్ప చేయదగిందేం లేదు. ఇకపై కూడా ఉండదు కూడా!తెలుగు జాతికి జేజేలు తెలుగు భాషకు జేజేలు అని ఆ ఆత్మ ఎక్కడున్న పలికే నినాదం ఇదే అయి ఉంటుందని అభిమానుల ఊహ.ఇదే నిజం కూడా! పెద్దాయనా నీకు ఓ వందనం!
ఎల్పీ (లక్ష్మీ పార్వతి) ఇవాళ ఓ సంచలన విషయం చెప్పారు.తాను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడానని చెప్పారు.అదేవిధంగా పదహారేళ్ల అమ్మాయి దేహంలో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించి తనతో మాట్లాడిందని చెప్పి కూడా ఆశ్చర్యపరిచారు.ఆమె మాటలు ఎలా ఉన్నా నిజంగానే ఒకవేళ ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడితే ఏం మాట్లాడిందో ఓ సారి ఊహిద్దాం. ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడితే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. విభజన వేళ అది తప్పనిసరి అయినప్పుడు తన సొంత పార్టీ (టీడీపీ) నాయకులు ఎలా ప్రవర్తించారో ఇతరులు ఎలా ప్రవర్తించారు అన్నది తప్పక ప్రశ్నిస్తుంది. ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడితే ఆ రోజు జనతా వస్త్రాలు తాను పేదలకు అందించానని ఇప్పుడెందుకు అందించడం లేదని అడుగుతుంది పాలకులను! ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడితే రూపాయి బియ్యం పథకం అమలులో మరియు పంపిణీలో ఎందుకు పారదర్శకత పాటించడం లేదని తప్పక నిలదిస్తుంది ఇప్పటి పాలక వర్గాలను! ఇంకా ఎన్నో ! మచ్చుకు కొన్నిఅంతే!