చలికి వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు…

-

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ఇన్నాళ్లు కాస్త సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.  చలిగాలులు ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కన్నా 2-6 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మరోవైపు తెలంగాణ, ఏపీల పై అధిక పీడన ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.  మరో రెండు రోజుల పాటు చలి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇటీవల వారం పాటు ఇటు తెలంగాణ, అటు ఏపీల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆ సమయంలో చలి తీవ్రత తగ్గినా.. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో మరోసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆదిలాబాద్, విశాఖ పట్నం ఏజెన్సీ ప్రాంతాలు చలితో, పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news