లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్చి 21 వరకు ఇలా చేయండి..!

-

మన పూర్వీకులు ఖగోళంలో జరిగే పలు విషయాలను కచ్చితమైన లెక్కలతో గణించి ఆయా యోగాలను, వింతలు, విశేషాలను, అపూర్వ శాస్ర్తాన్ని మనకు అందించారు. దీనిలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. వచ్చే ఏడాది ఆకాశంలో ఆయా గ్రహాల సంచారం, కలయికలు ముందుగానే లెక్కించి చెపుతారు. ఇక్కడి వరకు ఆధునికులకు సైతం అభ్యంతరాలు లేవు. తర్వాత వారు చెప్పిన ఆయా గ్రహాల విషయాలు, కలయికల వల్ల లాభాలు, నష్టాలు, వాటికోసం చేసుకోవాల్సిన పరిహారాల విషయంలోనే చాలామంది విబేధిస్తారు. ఒక్కనిమిషం వివేకంతో ఆలోచించండి.

To get laxmi devi anugraha offer these prayers till march 21

పూర్వీకులు చెప్పిన ఖగోళ లెక్కల్లో తేడాలు లేనప్పుడు వారు చెప్పిన పరిహారాలు, యోగాల్లో కూడా తేడా ఉండదు అనేది సత్యం. అయితే ప్రస్తుత మన సాంకేతికత ఆ స్థాయికి చేరుకోక దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆయా విషయాలు నిరూపితం అవుతాయి. ఉదా- సూర్యుడికి భూమికి మధ్యదూరం, ఆయా గ్రహాల వేగం, రంగలు మనకు నిత్యం చేసే పలు స్తోత్రాలలో, సత్యనారాయణ వ్రతంలో సైతం సంక్షిప్తంగా వర్ణించబడ్డాయి. ఇప్పుడు వాటిని నాసా వంట ఆధునిక ప్రయోగశాలలు సైతం నిరూపించి మన పూర్వీకులు చెప్పిన గ్రహవిషయాలను నిజమని చెప్పారు. అటువంట పరంపరలో భాగంగా మార్చి 11 నుంచి 21 వరకు ఆకాశంలో ఆయా గ్రహాలు కన్పించే విధానం గురించి జ్యోతిష శాస్త్రం చెప్పింది. పంచాంగంలో పేర్కొన్నారు. వాటి పరంపరలో భాగంగా కింది అంశాలు… నమ్మకంతో ఆచరించి మహాయోగాలను పొందండి.


మహాలక్ష్మీ కటాక్షం కోసం..

శుక్ల పంచమి, భరణి నక్షత్రం, సోమవారంతో కలిసి ఉండటంతోపాటు సోమవారం నుంచి సరిగ్గా 11వరోజు అంటే చివరరోజు గురువారం ఉత్తర నక్షత్రంతో సమాప్తం కావాలి. అదేవిధంగా పదకొండు రోజుల్లో మధ్య రోజు శనివారం, పునర్వసు నక్షత్రం వచ్చి ఉంటే ఇవి మహా యోగదినాలు అని జ్యోతిష పరంగా అంటారు. ఈ కాలంలో చిన్నచిన్న పరిహారాలను చేస్తే శని, చంద్రుడుతోపాటు మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.

ఈ పదకొండు రోజులు సాయంత్రం సమయాల్లో అంటే చంద్రోదయం అయిన తర్వాత చంద్రుని చూస్తూ లక్ష్మీదేవి స్తోత్రం లేదా నామపారాయణం చేయండి. అదే సమయంలో శనిదేవున్ని ప్రార్థించండి. దీనివల్ల శని అనుగ్రహం, చంద్రుని అనుగ్రహం కలుగుతాయి. దీనివల్ల చంద్రసహోదరి అయిన లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. సాయంత్రం పూట దేవుని దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి పైన చెప్పిన ప్రార్థనలు చేయండి. ఒక్క ఐదు నిమిషాలు. ఇలా మార్చి 21 వరకు చేస్తే తప్పక మీకు చంద్రుడు, శని అనుగ్రహాలు కలిగి మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ విషయాలు జ్యోతిష పండితులు పేర్కొన్నది. ఈ విషయాలు పలు సంహితల్లో ఉన్నది. ఓం నమో మహాలక్ష్మీయైనమః

నోట్ – మీ దగ్గర్లోని పురోహితులను, జ్యోతిష పండితులను సంప్రదించి ఆయా యోగాల విశేషాలను తెలుసుకోండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news