ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. తెలంగాణ కంటే రెట్టింపు పన్నుల వాటా విడుదల !

-

తెలంగాణ రాష్ట్రం కంటే… చాలా లోటు బడ్జెట్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే కేంద్రానికి పెద్దఎత్తున పనులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్ని రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది. ఇందులో ఏపీకి అయితే ఈసారి రూ.3847 కోట్లు విడుదల చేసింది.

కానీ తెలంగాణ రాష్ట్రానికి కేవలం 1998 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ మొత్తం రెండు నెలల పన్నుల వాటా… వచ్చే నెల ది కూడా కేంద్రం ముందుగానే చేసింది. సాధారణంగా నెలకు పన్నుల వాటా కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి.. రూ.1923 కోట్లు… తెలంగాణ రాష్ట్రానికి నెలకు 999 కోట్లు ఇస్తుంది. ఇలా చూసినా తెలంగాణ కంటే ఏపీకి దాదాపు రెట్టింపు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి ఆదాయం తక్కువ కాబట్టి అదే విధంగా లోటు ఉన్న రాష్ట్రాల పట్ల కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి పన్నుల వాటా ఎక్కువగా వస్తుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news