మంత్రి మేకపాటికి రెండోసారి కరోనా.. ఆందోళనలో ఏపీ మంత్రులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమ క్రమంగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని రాజకీయ నాయకులను ఈ కరోనా వైరస్‌ అస్సలు వదలడం లేదు. ఇక తాజాగా కరోనా బారిన పడ్డారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆయనకు కరోనా సోకడం ఇది రెండో సారి. నిన్ననే క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు మంత్రి మేకపాటి.


మాస్క్ లేకుండానే క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు మంత్రి మేకపాటి. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు మంత్రి మేకపాటి. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు మేకపాటి. అయితే.. నిన్న కేబినేట్‌ కు హాజరైన మంత్రుల్లోనూ కాస్త ఆందోళన మొదలైంది.

కాగా..ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 12, 926 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,66, 194 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో ఆరుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 538 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news