లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ వైస్రాయ్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్..!

-

రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మార్చి 22న రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమా రిలీజ్ అవుతుందా కాదా అన్న సందిగ్ధం వీడలేదు. ఓ పక్క టిడిపి శ్రేణులు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో కీలక ఘట్టమైన వైస్రాయ్ హోటల్ సీన్ లీక్ అయ్యింది. అది ఎలా వచ్చింది ఎవరు లీక్ చేశారు అన్నది తెలియదు కాని సినిమాలో అత్యంత కీలక సన్నివేశమైన వైస్రాయ్ హోటల్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చైతన్యరధం మీద ఎన్.టి.ఆర్ హోటల్ లోపల ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతుండగా చెప్పుల దాడి జరుగుతుంది. ఈ సీన్ వర్మ స్టైల్ లో ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఉంది. ఇన్నాళ్లు పబ్లిసిటీ కోసం ఒకటి చెప్పి సినిమాలో మరొకటి చూపించే ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో మాత్రం అసలే మాత్రం టాక్ తప్పకుండా సినిమా తెరకెక్కించాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news