RRR తో బాలయ్యకు లింక్.. ఎలాగెలగా..!

-

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కథ ఇది అని చెప్పిన టైం నుండి సినిమా గురించి హంగామా మరింత పెరిగింది. ఇద్దరి రియల్ హీరోస్ రియల్ స్టోరీకి కొద్దిపాటి కల్పితాన్ని జోడించి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నానని అన్నాడు రాజమౌళి. సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తుండగా.. రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నాడు. ఇదిలాఉంటే ఆర్.ఆర్.ఆర్ స్టోరీ లీక్ అవగానే ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు చేస్తున్న ఆ రెండు పాత్రలు మా బాలయ్య బాబు ఒక్కడే చేశాడంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అదెలా అంటే.. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో బాలకృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాడు. దాసరి డైరక్షన్ లో వచ్చిన పరమవీరచక్ర సినిమాలో కొమరం భీం గా కనిపించి ఓ రెండు డైలాగ్స్ కూడా చెబుతాడు. సో అల్లూరి, కొమరం భీం ఈ రెండు పాత్రల్లో బాలయ్య అదరగొట్టాడని ఈ ఇద్దరు హీరోలకన్నా ముందే మా బాలయ్య ఈ పాత్రలు చేశాడని తెగ హడావిడి చేస్తున్నారు.

రాజమౌళి చెప్పిన విషయాన్ని క్లియర్ గా గమనిస్తే.. అల్లూరి, కొమరం భీం ఇద్దరు ఫ్రీడం ఫైటర్స్ గా మారక ముందు జరిగే కథతో ఆర్.ఆర్.ఆర్ తీస్తున్నామని చెప్పాడు. అంటే అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా మారకముందు.. కొమరం భీం నిజాం పాలనపై వ్యతిరేకత చూపకముందు ఈ సినిమా కథ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news