జగనన్న…‘ఎన్టీఆర్‌’తో నో యూజ్…’రంగా’తో రివర్స్?

-

ఏదో అనుకుంటే..ఇంకా ఏదో అయినట్లు…జిల్లాల విభజన వల్ల వైసీపీకి లాభం జరుగుతుందనుకునే లోపు…కొన్ని చోట్ల రివర్స్ అవుతుంది. జిల్లాల విభజన పట్ల జనం పాజిటివ్‌గానే ఉన్నారు కాకపోతే కొన్ని చోట్ల మాత్రం ప్రజలు సంతృప్తిగా లేరు. అదే సమయంలో జిల్లాల పేర్ల విషయంపై కూడా సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇక కొన్ని చోట్ల జిల్లాల పేర్లని మార్చాలని ప్రజలు సూచిస్తున్నారు.

jagan
jagan

ఇదే క్రమంలో కృష్ణా జిల్లాని రెండు జిల్లాలుగా చేసి…ఒక జిల్లాకు కృష్ణా పేరునే ఉంచేసి..విజయవాడ పార్లమెంట్‌కు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు ఉన్నది…మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని కృష్ణా జిల్లాలో…అలాంటప్పుడు విజయవాడకు ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారనే విమర్శలు వస్తున్నాయి.

అయితే ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరి నాయకుడు కాబట్టి… ఏ జిల్లాకు ఆయన పేరు పెట్టిన ఇబ్బంది లేదని కొందరు అనుకుంటున్నారు. కాకపోతే ఎన్టీఆర్ పేరు పెట్టడం వల్ల విజయవాడలో రాజకీయంగా లబ్ది జరుగుతుందని వైసీపీ భావించింది. అలాగే ఇలా ఎన్టీఆర్ పేరు పెట్టడం వల్ల టీడీపీ ఇరుకున పడుతుందని అనుకున్నారు. కాని వైసీపీ అనుకున్నది మాత్రం జరిగినట్లు కనిపించడం లేదు. అనుకున్న ప్రకారం రాజకీయ లబ్ది ఏమి రాలేదు. పైగా టీడీపీకి వచ్చే నష్టం ఏమి కనబడటం లేదు. అసలు ఇప్పటివరకు ఎన్టీఆర్ విగ్రహాలని ధ్వంసం చేసి, ఇప్పుడు ఏదో పేరు పెట్టడం వల్ల యూజ్ లేదు అంటున్నారు.

విచిత్రం ఏంటంటే.. ఎన్టీఆర్ పేరు పెట్టాం కదా.. నందమూరి ఫ్యామిలీ, టీడీపీ నేతలు కనీసం జగన్‌కు థాంక్స్ చెప్పడం లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టినప్పుడు రోశయ్యకు జగన్ థాంక్స్ చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే పేరు పెట్టడం వల్ల వైసీపీకి ఒరిగింది ఏమి లేదు…పైగా ఇప్పుడు కొందరు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ ఇరుకున పడ్డట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news