సీఎం కేసీఆర్‌ పై ఏపీ నేత వ‌ర్ల రామ‌య్య సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ను కారణంగా చూపి మోడీని, బీజేపీని చెడామడా రెండున్నర గంటల పాటు తిట్టేశారు. నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగం గంటన్నరే సాగింది. కానీ కేసీఆర్‌ మాత్రం రెండున్న గంటల సమయం తీసుకున్నారు. మూడు భాషల్లో రెచ్చి పోయారు. అయితే.. రాజ్యంగం మార్చాలి.. అనే కొత్త నినాదాన్ని కేసీఆర్‌ తెరపైకి తెచ్చారు. ఈ వాదన తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

అయితే.. ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ పై ఏపీ నేత వ‌ర్ల రామ‌య్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానించే కేసీఆర్‌ వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” క్రొత్త రాజ్యాంగo కావాలంటాడేంటి ఆ ముఖ్యమంత్రి. అంటే, డా: అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగo అక్కర్లేదా? అవుసరమైనప్పుడు రాజ్యాంగానికీ చేర్పులు చేసుకొనే అవకాశముందని ఆయనకు తెలియదా? ఈ మాత్రo తెలియకుండా, అసలు క్రొత్త రాజ్యాంగo కావాలంటే, అంబేడ్కర్ ను అవమానించినట్లే, అర్ధo చేసుకోండని మనవి.” అంటూ నిప్పులు చెరిగారు వర్ల రామయ్య.

Read more RELATED
Recommended to you

Latest news