మేం ఫిర్యాదు చేస్తే..జగన్‌ సర్కార్‌ కూలడం ఖాయం : పీఆర్సీ సాధన సమితి

-

పీఆర్సీ సాధన సమితి నాయకులు సూర్యనారాయణ జగన్‌ సర్కార్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల జీతాల విషయంలో కోర్టులతో సహా అందర్నీ ప్రభుత్వం మభ్య పెడుతోందని నిప్పులు చెరిగారు. పే-స్లిప్పులను అగ్గి మంటల్లో తగులబెట్టలేదు.. కడుపు మంటతో తగులబెట్టారన్నారు. నిబంధనల ప్రకారం కాకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు వేయడం సాంకేతికంగా చెల్లదని.. మా రహస్య కోడ్ ను తస్కరించి జీతాలు వేశారని ఆగ్రహించారు.

మా కోడ్ దొంగతనం జరిగిందని ఉద్యోగులంతా ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వం ఏమవుతుంది..? కచ్చితంగా కూలిపోతుందని పీఆర్సీ సాధన సమితి నాయకులు సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.జీతాలు పెరిగాయో.. లేదో ఉద్యోగులకు తెలీదా..? తామే తెలివైన వాళ్లన్నట్టుగా ఐఏఎస్సులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం అంత అమాయకులమా..? ఏం తెలియకుండానే మేం ఇన్నాళ్లూ పని చేశామా..? అని నిలదీశారు. ఘర్షణ వాతావరణం తొలగించేలా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పెద్దల చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news