డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? అయితే ఈ డ్రింక్స్ ని తీసుకోండి..!

-

చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే మీరు కూడా డయాబెటిస్ తో బాధపడుతున్నారా…? డయాబెటిస్ సమస్య నుండి బయట పడాలి అని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ డ్రింక్స్ ను తీసుకోండి. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే మరి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచే ఆ డ్రింక్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయ నీళ్లు:

ఉల్లిపాయను చాలా వంటల్లో వాడతాము. ఉల్లిపాయ వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఉల్లి మనకి సహాయపడుతుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది ఉల్లిపాయ. దీని కోసం మీరు రెండు ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిని ముక్కలుగా కట్ చేసి అందులో నిమ్మరసం, ఉప్పు వేసి ఒక గ్లాసు నీళ్ళు వేయండి. ఆ తర్వాత దీన్ని బ్లెండ్ చేసి వడ కట్టకుండా తీసుకోండి.

కరివేపాకు నీళ్లు:

కరివేపాకులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణాన్ని స్లో చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. కొన్ని కరివేపాకు ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీళ్ళు వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకోండి.

మెంతులు నీళ్లు:

మెంతులు కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. మెంతుల్ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే మరిగించి ఆ నీళ్లని తీసుకోండి.

తులసి నీళ్లు:

ఆరు నుండి ఎనిమిది తులసి ఆకుల్ని ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించి వేడిగా కాని చల్లగా కాని తీసుకోండి. ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

వేపాకు నీళ్లు:

వేపాకు కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. కొన్ని వేపాకులు నీళ్లలో వేసి మరిగించి దానిని తీసుకోండి. ఇలా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news