అలాంటివి అస్సలు పట్టించుకోను… ప్రియమణి..!

-

అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టాలీవుడ్ లో ప్రియమణి మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా టాలీవుడ్ లో యమదొంగ సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ తో సహా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత మాత్రం ప్రియమణి ఆరెంజ్ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త స్లో అయింది.

ప్రస్తుతం ప్రియమణి కొన్ని రోజుల క్రితం విడుదలైన నారప్ప సినిమాలో నటించింది. ఇది మాత్రమే కాకుండా కొన్ని టీవీ షో లకు జడ్జ్ గా కూడా ప్రియమణి వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రియమణి.. పెళ్లి తర్వాత కెరియర్ పరంగా నేను ఇంకా బిజీ అయ్యాను. ఇప్పుడు నాకు కంఫర్టుబుల్ గా అనిపిస్తుంది. టీవీ షోలు .. వెబ్ సిరీస్ లు .. సినిమాలు వరుసగా చేస్తున్నాను అని ప్రియమని తెలిపింది. ప్రియమణికి మూవీలు తగ్గడం వల్లనే టీవీ షోస్ చేస్తుందనే విమర్శలు నా వరకూ రాలేదు. నేను చేస్తున్న టీవీ షోస్ కి మంచి రేటింగ్స్ వస్తున్నాయని ప్రోత్సహించారే తప్ప ఎవరూ కూడా నిరాశపరచలేదు అని ప్రియమణి తెలియజేసింది. నెగెటివ్ గా కామెంట్స్ పెట్టొచ్చు .. కానీ వాటిని గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే అసలు నేను యూట్యూబ్ చూడను. నా షోస్ కి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ లో చూడటం మిస్సయినప్పుడు యూ ట్యూబ్ చూస్తాను అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news