ఫిబ్రవరి చివరి నాటికి వైద్యశాఖలో 30 వేల ఖాళీల భర్తీ చేస్తామని సీఎం జగన్ ప్రకటన చేశారు. కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలన్నారు. నాడు – నేడు కింద చేపట్టిన పనులను సమీక్షించిన సీఎం.. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడం పై దృష్టి ఉంటుందని.. డాక్టర్లు గిరిజన ప్రాంతాల్లోనేఉండి సేవలను అందిస్తానంటే ఎలాంటి ప్రతిపాదనకు అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఉంటాయని.. ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో పూర్తిగా ఖాళీల భర్తీ చేస్తామని ప్రకటన చేశారు. డాక్టర్లు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పష్టంగా మార్పులు కనిపించాలని సిఎం జగన్ స్పష్టం చేశారు.