ఇటీవల పాన్ ఇండియా రెంజ్ విడుదల అయి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాలలో సూర్య జై భీమ్ ముందు వరుసలో ఉంటుంది. న్యాయం కోసం పోరాడిన జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా విడుదల అయింది. ఈ జై భీమ్ సినిమా దేశ వ్యాప్తంగా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా భారత దేశం నుంచి ఆస్కార్ నామినేషన్స్ కు కూడా అర్హత సాధించింది. అయితే తాజా గా ఈ రోజు ఆస్కార్ సంస్థ అధికారికంగా ఆస్కార్ బరిలో ఉండే సినిమాలను ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 10 సినిమాలు నామినేషన్స్ లో ఉన్నాయని ప్రకటించింది. ఈ లీస్టులో జై భీమ్ కు స్థానం లభించలేదు. అంతే కాకుండా ఆస్కార్ నామినేషన్స్ లో భారత్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ప్రపంచ వ్యాప్తంగా బెల్ఫాస్ట్, కోడా, డెంట్ లూక్ అప్, డ్రైవ్ మై కార్, డూనే, కింగ్ రిచార్డ్స్, లికోరైస్ పిజ్జా, నైట్‌మరే అల్లే, ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ ఉన్నాయి.
#OscarNoms: Best Picture
“Belfast”
“CODA”
“Don’t Look Up”
“Drive My Car”
“Dune”
“King Richard”
“Licorice Pizza”
“Nightmare Alley”
“The Power of the Dog”
“West Side Story”https://t.co/OjTdPwhHhb— Variety (@Variety) February 8, 2022