తెలంగాణ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల బహిరంగ ప్రకటన !

-

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. అయితే.. విషయంపై బహిరంగ ప్రకటన చేశారు వైఎస్‌ షర్మిల. తెలంగాణ ఇచ్చిన వారికైనా .. తెలంగాణ తెచ్చిన వారికైనా .. తెలంగాణ కోసం కొట్లాడిన వారికైనా .. ఎవరికైనా తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే .. సాధించిన తెలంగాణాలో చావులు లేకుండా చూడాలంటూ పేర్కొన్నారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టించుకోనివారు… తెలంగాణ ఎలా ఏర్పడిందని కొట్టుకు చస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించిన తెలంగాణలో చావులు ఆగాలని… ముఖ్యంగా రైతులు అలాగే నిరుద్యోగుల చావులు ఆపాలని… అదే నిజమైన రాష్ట్ర సాధన అని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంటును ప్రజల్లో రగిలించి క్యాష్ చేసుకోవాలని సీఎం కేసీఆర్తో పాటు బీజేపీ పార్టీ కూడా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎక్కడ తిరస్కరిస్తారోనని భయంతో సెంటిమెంట్ డ్రామాను ముందుకు తీసుకువచ్చి రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news