యూట్యూబ్ లో ‘ అరబిక్ కుతు’ కల్లోలం… రికార్డ్ వ్యూస్ సాధిస్తున్న తలపతి విజయ్ సాంగ్

-

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, పూజాహెగ్డే మూవీ ‘బీస్ట్’ నుంచి రిలీజ్ అయిన ‘ అరబిక్ కుతు’ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. 24 గంటల్లోనే 28 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ సాంగ్ ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 2.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ సూపర్ గా ఉంది. విజయ్, పూజా హెగ్డే డ్యాన్స్ తో దుమ్ము రేపారు. 

మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. స్వయంగా అనిరుధ్ పాట పాడారు. అనిరుధ్ తో పాటు జోనితా గాంధీ పాట పాడారు. శివకార్తికేయన్ లిరిక్స్ అందించారు. మ్యూజిక్, డ్యాన్స్, విజయ్ మాస్ అప్పియరెన్స్, పూజా హెగ్డే అందాలు… అరబిక్ కుతు సాంగ్ ని ఓ రేంజ్ లో హిట్ చేశాయి. దీంతో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. ఎప్రిల్ 14న మూవీ విడుదల కానుంది. సన్ పిక్చర్స్ బ్యానెర్ పై ఈసినిమా వస్తోెంది.

Read more RELATED
Recommended to you

Latest news