ఏపీలో టికెట్ ధరలు కొలిక్కి వచ్చినట్లే తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల సినిమా ప్రముఖులతో చర్చించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… టికెట్ ధరలపై, టాలీవుడ్ సమస్యలపై హామీ ఇచ్చినట్లు సినీ ప్రముఖులు వెల్లడించారు. ఇటీవల చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్. నారాయణ మూర్తి, కొరటాల శివ, పోసాని, అలీ ముఖ్యలు సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. నిన్న ‘ మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా జగన్ తో భేటీ అయ్యారు.
టికెట్ ధరలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రేపు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో రేపు 11.30 గంటలకు జరిగే ఈ భేటీలో ప్రభుత్వానికి కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే టికెట్ ధరల ప్రతిపాదనలు సిద్ధం కాగా.. రేపు ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. టికెట్ ధరల ప్రతిపాదనలు పవన్ కళ్యాణ్ ‘ భీమ్లానాయక్’ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈనెల 25న భీమ్లా నాయక్ విడుదల కానుంది. దీంతో పాటు వరణ్ తేజ్ గనీ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాా కలెక్షన్లకు కొత్తగా ప్రతిపాదించే టికెట్ రేట్లు ప్లస్ కాబోతున్నాయి.