అమరావతి : ఇవాళ ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి చాలా బిజీ షెడ్యూలు గడపనున్నారు. ఇవాళ కడప, విశాఖ జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా కడప లో పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.
అనంతరం కడప జయరాజ్ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్న సీఎం జగన్.. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించనున్నారు.
సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న సీఎం జగన్.. అక్కడి నుంచి నేవల్ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్ డేగా వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు జగన్ మోహన్ రెడ్డి.