రే’వంతు’: జగ్గారెడ్డి లైట్.. కోమటిరెడ్డికి లైన్ క్లియర్?

-

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీలది ఒక దారి అయితే కాంగ్రెస్ పార్టీది మరో దారి అన్నట్లు పరిస్తితి ఉంది..ఓ వైపు బీజేపీ-టీఆర్ఎస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి.. కానీ కాంగ్రెస్ మాత్రం అంతర్గత విభేదాలతోనే సతమతవుతుంది…కాంగ్రెస్ నాయకులు ప్రత్యర్ధులపై పోరాటం చేయడం కంటే…సొంత పార్టీ వాళ్ళనే ప్రత్యర్ధులుగా మార్చుకుని పోరాటం చేస్తున్నారు. ఇక ఇటీవల కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి ఇష్యూ ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు.

అసలు రేవంత్ రెడ్డి అంటే జగ్గారెడ్డికి పడటం లేదు..పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి రేవంత్‌ని టార్గెట్ చేసుకునే జగ్గారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. ఇక రేవంత్ వర్గం సైతం పరోక్షంగా జగ్గారెడ్డికి చెక్ పెట్టడానికి చూస్తుంది..జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అనే ముద్ర కూడా వేసింది..దీంతో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటానికి సిద్ధమైపోయారు. ఇక సీనియర్లు బ్రతిమలాడిన సరే జగ్గారెడ్డి వెనక్కి తగ్గేలా లేరు…ఇక ఆయన కాంగ్రెస్‌ని వీడటానికే సిద్ధమయ్యారు.

ఇలా పార్టీని వీడటానికి సిద్ధమైన జగ్గారెడ్డిని కలిసి బుజ్జగించే పని రేవంత్ చేయడం లేదు..అసలు మొదట నుంచి జగ్గారెడ్డిని కలిసి సమస్యని తగ్గించే పని రేవంత్ చేయలేదు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో మాత్రం రేవంత్ కాస్త ముందున్నారు. కోమటిరెడ్డి ఎలాంటి విమర్శలు చేసినా సరే, ఆయనకు సర్ది చెప్పడానికే రేవంత్ చూశారు..అలాగే ఆయనని పలుమార్లు డైరక్ట్‌గా కూడా కలిశారు. అంటే ఇక్కడ కోమటిరెడ్డికి ఇచ్చే ప్రాధాన్యత జగ్గారెడ్డికి ఇవ్వడం లేదని అర్ధమవుతుంది.

అదే సమయంలో కోమటిరెడ్డికి నల్గొండలో ఫుల్ ఫ్రీడం ఇచ్చేశారని తెలుస్తోంది. జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ సన్నిహితులకు టిక్కెట్లు ఇవ్వడానికి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ చేసే డిమాండ్లకు అడ్డు చెప్పుకూడదని రేవంత్ ఫిక్స్ అయ్యారట. వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే రేవంత్ చూస్తున్నారట. కానీ జగ్గారెడ్డి విషయంలో మాత్రం రేవంత్ అలా నడవటం లేదు. అంటే ఇక్కడ జగ్గారెడ్డిని రేవంత్ లైట్ తీసుకున్నారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news