తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.. పెద్ద అబద్ధాల కోరు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ది నోరు కాదని.. తాటి మట్ట అని విమర్శించారు. ప్రతి విషయంలో కేసీఆర్ అబద్ధాలనే చెబుతున్నారని అన్నారు. బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం.. కాన్పరేన్స్ లో కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయమని చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ద్వంద్వ విధానంతో తెలంగాణ రాష్ట్ర రైతులు నష్ట పోతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ. 62 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఏప్రిల్ నుంచి విద్యుతు బిల్లు లను పెంచాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలకు విద్యుతు బిల్లులను భారీగా పెంచి.. తన ఫామ్ హౌస్ కు మాత్రం ఉచితంగా విద్యుతును ఉపయోగించుకుంటున్నాడని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని అన్నారు. తప్పక బీజేపీయే గెలుస్తోందని అన్నారు. దాని నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారని ఆరోపించారు.