కరోనాపై సంచలన విషయం వెల్లడి… జంతువు నుంచే సోకిందని తాజా అధ్యయనాల వెల్లడి

-

కరోనా వ్యాధి ప్రపంచాన్ని అల్లకొల్లోలం చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే దీని పుట్టుక గురించి మాత్రం ఇప్పటి వరకు అనేక సందేహాలు అలాగే ఉన్నాయి. 2019 నవంబర్ చివర, డిసెంబర్ మొదటి వారాల్లో చైనాలోని వూహాన్ లో కరోనా వ్యాధి వ్యాప్తి ప్రారంభం అయింది. అనతి కాలంలోనే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా మహమ్మారి బారిన పడ్డాయి. అయితే తాజాగా ఈ వ్యాధి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.corona-virus

కరోనా వ్యాధి జంతువుల నుంచే వ్యాపించిందని.. ల్యాబ్ నుంచి కాదంటూ తాజా అధ్యయాలు తేల్చాయి. వూహాన్ నగరంలోని సీఫుడ్ మార్కట్ నుంచే వ్యాధి వ్యాప్తి చెందినట్లు స్టడీలు తేల్చాయి. నిజానికి ఏ జంతువు నుంచి వ్యాప్తించిందో ఖచ్చితంగా చెప్పలేకపోయాయి రీసెంట్ స్టడీస్. అయితే వూహాన్ మార్కెట్ కేంద్రంగానే కరోనా కేసులు మొదలయ్యాయని స్టడీలో తేలింది. ముఖ్యంగా వూహన్ మార్కెట్ పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువ కేసులు నమోదైనట్లు గుర్తించారు. చైనాలోని ప్రయోగశాల నుండి కరోనావైరస్ లీక్ అయిందనే సిద్ధాంతాన్ని బలపరిచేలా.. శాస్త్రీయంగా ధృవీకరించబడిన ఆధారాలు లేవని నివేదిక నిర్ధారించింది.  వైరస్ ప్రకృతిలో నుంచే వ్యాపించిందని పీర్-రివ్యూ చేసిన అధ్యయనాలు గట్టిగా తెలుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news