ఉక్రెయిన్ దేశంపై రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా… ఉక్రెయన్ రాజధాని “కివి”లోని ప్రజావాసాల పై రష్యా ఆర్మీ ఫిరంగులు వర్షం కురిపిస్తోంది. దీంతో రష్యా సైనిక దాడులు ప్రారంభమైన గురువారం నుంచి ఇప్పటి వరకు ఉక్రెయన్ లో 14 మంది పిల్లలతో పాటు, మొత్తం 342 మంది మృతి చెందారు. అంతేకాదు.. ఈ మరణాల సంఖ్యను ఉక్రెయన్ దేశం కూడా నిర్ధారించారు. అటు ప్రాణ నష్టం తమకూ జరిగినట్లు తొలిసారిగా ఒప్పుకుంది రష్యా దేశం.
ఉక్రెయన్ లోని రెండవ అతిపెద్ద నగరమైన “ఖార్ కివ్” లో ప్రజావాసాలపై రష్యా ఫిరంగి దళాలు జరిపిన దాడుల్లో 11 మంది పౌరులు మృతి చెందారు. రష్యా సైనిక దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయన్ ను సుమారు 5 లక్షల మంది విడిచి వెళ్లినట్లు “ఐక్యరాజ్య సమితి” అనుబంధ సంస్థ వెల్లడించింది.కాగా.. నిన్న ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.