బిజినెస్ ఐడియా: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి కూరలు పండిస్తూ లక్షలు..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఓ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక ఫాలో అయ్యారంటే మంచిగా రాబడి వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాన్ని చేస్తున్నారు. పైగా మళ్ళీ చాలా మంది వ్యవసాయం పై దృష్టి పెడుతున్నారు. ఏకంగా ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి ఒక యువకుడు గిరిజన వ్యక్తులకు ఏదైనా చేయాలని వారితో పాటు వ్యవసాయం మొదలు పెట్టాడు.

 

పైగా ఇలా చేయడం వల్ల గతంలో కంటే ఎక్కువ ఆదాయం వస్తోందని.. ఏకంగా రెండు రేట్లు లాభం వస్తోందని చెప్పాడు. ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… ఛత్తీస్గడ్ కు చెందిన దీనానాథ్ రాజపూత్ తల్లిదండ్రులు చెప్పడంతో బలవంతంగా ఇంజనీరింగ్ చదివాడు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అతనికి ఎలాంటి సంతృప్తి దొరకడం లేదని సొంత ఊరు వచ్చేశాడు.

గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు పనిచేస్తున్న ఎన్జీవో లో చేరాడు. సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు సామాజిక సేవ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ని కూడా పొందాడు. సివిల్ సర్వీస్ లో మాత్రం అతనికి సక్సెస్ అందలేదు. కానీ మొగిలి జిల్లాలో కర్మచారి గా స్వచ్ఛ భారత్ మిషన్ కు వాలంటీర్ గా అతనిని నియమించారు.

2015లో ఇతనికి ఉత్తమ కర్మచారి అవార్డు కూడా వచ్చింది. సామాజిక కార్యకర్త సమాజంలో సభ్యులకు సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులు, తగిన మోతాదులో ఎరువులు ఎలా ఉపయోగించాలి ఇలాంటివన్నీ తెలుపుతూ రైతులకు అండగా ఉన్నాడు. ఇప్పుడు అతని వల్ల మూడు జిల్లాలు లో ఆరు వేల మందికి పైగా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. 25 నుంచి 30 శాతం లాభాలను పొందుతున్నారు. అలానే చింతపండు సాస్, డ్రై మ్యాంగో పౌడర్ వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తారు. ఇలారైతులతో కలిసి కూరగాయల లక్షలు సంపాదిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news