కొండ గుహలోంచి వింత శబ్దాలు..ఏంటా అని చూస్తే.. గుండె గుబేల్..!

-

పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. అయినా సరే పాములను పూజించటం మన ఆచారం.. సరే ఈ విషయం పక్కన పెడితే.. మీకు సడన్గా ఒక్క పాము కనిపిస్తేనే.. ఫీజులు ఎగిరిపోతాయ్..అలాంటిది ఒకేసారి.. ఒకేచోట పదిపైనే పాములు చూస్తే.. అసలు నోట మాట వస్తుందా.. పై ప్రాణాలు పైనే పోతాయి కదా. ఇంతకీ ఈ పాములు ఏంటి..ఈ లొల్లి ఏందో, ఎక్కడ కనిపించాయో చూద్దామా..!
 పదుల సంఖ్యలో పాములు ఈ గ్రామస్థులను కలవర పెట్టాయి. అవి కూడా ఏ చిన్నా చితకా పాములో కావు.. ఏకంగా పది అడుగులకు మించిన కొండ చిలువలు కనిపించడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కొండచిలువలు హల్ చల్ చేశాయి. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో పదుల సంఖ్యలో కొండచిలువలు గ్రామస్థులను భయాందోళనకు గురిచేశాయి . గ్రామానికి పక్కనే ఉన్న ఓ కొండపై బండరాళ్ల మధ్య కొండచిలువలు నక్కి ఉన్నాయి. ఈ మధ్యే కొండపై రామాలయం నిర్మాణానికి గ్రామస్థులు పూనుకున్నారు. కొండ పరిశీలనకు వెళ్లారు. అక్కడ కనిపించిన కొండచిలువలను చూసి దెబ్బకి గుండెగూబేలుమంది. పది అడుగుల మేర ఉన్న కొండ చిలువలను చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు గ్రామానికి చేరుకుని కొండచిలువలను పట్టి అడవిలో వదలడంంతో పెద్ద ప్రాణాపాయమే తప్పింది. అయితే.. ఏదైనా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది కదా.. అలాగే ఈ కొండచిలువలను కూడా అక్కడివారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.. అంతే..వీడియో వైరల్ అయింది. న్యూస్ స్ప్రెడ్ అయింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు అన్ని కొండచిలువలు అక్కడి ఎలా వచ్చాయి అని కొందరంటుంటే.. ఒకవేళ అవి గ్రామస్థులపై యటాక్ చేసుంటే.. ఎంతో ప్రాణనష్టం జరిగి ఉండేదని మరికొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా.. ముందే గుర్తించి.. తీయించడం మంచిదైంది. ఇంతకీ మీరెప్పుడైన కొండచిలువలను చూశారా..?
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news