అరటి పంటలో నులి పురుగుల నివారణకు ఇలా చేయండి.

-

అరటి సాగులో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆశించటం వల్ల మొక్క ఎదుగుదల ఉత్పాదకత తగ్గిపోతుంది. నీరు, పోషకాలు మొక్కపై భాగాలకు అందకుండా శిలీంధ్రం మొక్కలో చేరి తెగులు సోకే అవకాశం ఉంటుంది.. రైతులు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే పంటను రక్షించుకోవచ్చు..
వేరు తొలుచు నులి పురుగు (ఐర్రోయింగ్‌ నిమటోడ్‌) : ఇది వేర్ల లోపల చారలు ఏర్పరచి నిర్వీర్యం చేస్తుంది. వేర్లపై నొక్కులు ఏర్పడి కొంత కుళ్ళిపోతాయి కూడా.
వేరు పుండు నులిపురుగు (రూట్‌ లీజన్‌ నిమటోడ్స్‌) : ఇవి ఆశించిన వేర్లపై గాయంలా పుండులా ఏర్పడుతుంది. అందుకే దీన్ని లీజన్‌ నిమటోడ్‌ అంటారు.
వేరుకాయ నులి పురుగు (రూట్‌నాట్‌ నిమటోడ్‌) : ఇది వేర్లపై కాయల్లాంటి, చిన్నరుద్రాక్షల్లాంటి బుడిపెల్ని కలుగజేస్తుంది. మొక్కలు పెరగక కురచగా ఉంటాయి.
స్పైరల్‌నిమటోడ్‌ : ఇవి సోకిన మొక్కల్లో క్షీణింపు తొందరగా వచ్చి దిగుబడులు 38 శాతం వరకు పడిపోతాయి.

అరటిలో నులి పురుగుల నివారణకు..

నులి వురుగులు సోకన తోటల నుండి పిలకల్ని సేకరించాలి. నాటే పొలాన్ని వేసవిలో లోతు దుక్కిదున్ని ఎండబెట్టాలి. దుంపపై వున్న వేర్లను పై చర్మాన్ని వలుచగా పదునైన చాకుతో చెక్కి తర్వాత లీటరు నీటికి 2 మి.లీ. మోనోక్రోటోఫాస్‌, 5 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ వంతున కలిపిన ద్రావణంలో ముంచి తీసి నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. పిలక నాటేటప్పుడే నాటే గుంటలో అరకిలో వేపపిండి లేదా ఎన్‌రిచ్స్‌ 5 కిలోల పశువుల ఎరువు లేదా ప్రెస్ మడ్ లాంటి చివికిన సేంద్రియ ఎరువులు వేస్తే నులిపురుగులు వృద్ధికాకుండా అదుపులో ఉంటాయి. పంటకు పోషకాలు నేలకు సేంద్రీయ పదార్థం అందుతుంది.
అరటిని వరితో పంట మార్చిడి చేస్తే నులివురుగులే కాక వాదుతెగులు రాదు. ట్రైకోడెర్మా విరిడిని నాటేటప్పుడు నాటే గుంతలో 20 గ్రాములు తర్వాత మూడు మాసాల వయసులో మొక్కకు 20 గ్రాములు, అందిస్తే నులిపురుగులు అదువులో వుంటాయి. పంట వేర్లలో చారలు కలిగించే నులి పురుగులు బెడ ఉంటే వాటిని నిరోధించడానికి పొలంలో జనుమును పెంచి పూమొగ్గ దశలో నేలలో కలియదున్ని తర్వాత అరటిని నాటుకోవాలి.
జనుము వంటతో సత్తువ, సేంద్రియం పెరుగుతుంది. వేరుకాయ నులిపురుగులు ఎక్కువున్న నేలల్లో పొలాల్లో బెండ , వంగ, టమాట, మిరప, పొగాకు లాంటి పంటలతో పంట మార్చిడి చేయకూడదు. ఇలాంటి పొలాల్లో బంతిపువ్వు పంటను. పండించి తర్వాత అరటి నాటుకొని నులి పురుగుల్ని చాలా తగ్గించవచ్చు. నులి వురుగుల సోకిన తోటల్లో మొక్కకు 10 గ్రాముల రుగ్‌బి, 10 3జి లేదా కాలడన్‌ 4 జి వంతున మొక్క మొదలు వద్ద సెం.మీ. లోతులో వేసి మట్టి కప్పి తేలికగా నీరు పెట్టాలి.
డ్రిప్పు నీటి పారుదల సౌకర్యమున్న తోటలకు ద్రవరూవంలో ఉన్న సూడోమోనాస్‌ ఫ్లోరసెన్స్‌ జీవసంబంధ మందును ఎకరానికి 1.6 లీటర్ల వంతున తోట నాటిన తర్వాత రెండవ, నాల్గవ, ఆరవ మాసాలకు డ్రిప్పు నీటి ద్వారా అన్ని మొక్కలకు అందిస్తే నులి పురుగులు వృద్ధి కాకుండా అదుపులో ఉంటాయి. డ్రిప్పు పద్ధతిలో నులివురుగుల వ్యాప్తి తగ్గుతుంది.
ఈ యాజమాన్య పద్దతుల ద్వారా పంటను నులిపురుగుల సమస్యనుంచి తగ్గించుకోవచ్చు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news