జెనీలియా కొడుకు ఫిట్ నెస్ వీడియో.. బచ్చాగ్యాంగ్ కు చాలెంజ్!

-

హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ముద్దుల కొడుకు రెహిల్ ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ల కొడుకులు, కూతళ్లు సహజంగానే సోషల్ మీడియాలో నానుతూ ఉంటారు. వాళ్ల ఫోటోలు అవీ ఇవీ ఎప్పుడూ షేర్ అవుతూనే ఉంటాయి. కానీ.. ఈ ఫిట్ నెస్ చాలెంజ్ వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంది.

దేశంలో ఫిట్ నెస్ చాలెంజ్ నడుస్తున్న విషయం తెలిసిందే కదా. ఎవరికైనా ఆ చాలెంజ్ విసిరితే.. వాళ్లు తమ ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరో ముగ్గురికి ఫిట్ నెస్ చాలెంజ్ ను విసరాలి. సేమ్ ఇలాగే రితేశ్ కూడా తన చిన్న కొడుకు రెహిల్ కు ఫిట్ నెస్ చాలెంజ్ ను విసిరాడట.

దీంతో తన తల్లి జెనీలియా సాయంతో ఇలా ఫిట్ నెస్ వీడియో చేసి ఇప్పుడు బచ్చాగ్యాంగ్ కు చాలెంజ్ ను విసిరాడు. ఈ వీడియో, చాలెంజ్ విసరడం అంతా జెనీలియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెహిల్ ఫిట్ నెస్ వీడియోకు ఫిదా అయిన కరణ్ జోహార్.. ఓమైగాడ్.. అతడిని చూడండి. అతడు రాక్ స్టార్. నేనైతే ఆ చాలెంజ్ ను పూర్తి చేస్తానో లేదో.. అంటూ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news