భారత ఆటగాళ్ల కోసం… సర్వర్ గా మారిన కేంద్ర మంత్రి..!!

-

ప్రస్తుతం ఆసియా క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో భారత్ ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. భారతదేశ పతాకాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. చైనా, జపాన్ లాంటి దేశాలకూ గట్టి పోటీ నిస్తూ పతకాలను చేజిక్కించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. ఆసియా క్రీడల్లో కొన్నిరోజుల కింద ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకున్నది. యూనియన్ మినిస్టర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న మన ఆటగాళ్లను ఉత్తేజపరచడానికి, ప్రోత్సహించడానికి జకర్తా వెళ్లాడు. అక్కడ భారత ఆటగాళ్లను కలిసి వాళ్లసేపు ముచ్చటించాడు. అనంతరం క్యాంటీన్ లో సర్వర్ గా మారి.. ఆటగాళ్లందరికీ స్వయంగా తానే వడ్డించాడు. సూప్, టీ, ఫుడ్ అన్నీ వాళ్లకు తీసుకెళ్లి అందించాడు. ఈ ఫోటోను ఎమ్మెల్యే కపిల్ మిశ్రా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా మంత్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news