త్వరలోనే టీడీపీ పార్టీ భూస్థాపితం కాబోతున్నదని… ఎన్టీఆర్ శాపం ఇప్పుడు ఫలించబోతోందని మోహన్ బాబు జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా… తణుకు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో మోహన్ బాబు పాల్గొని మాట్లాడారు.
కాళ్లు కడిగి కన్యాదానం చేసిన సొంత మామ ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ నాయకుడు, ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. సొంత మామ పార్టీని లాక్కుని ఇప్పుడు ఆ పార్టీ నాదే అంటున్న చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయన్నారు.
త్వరలోనే టీడీపీ పార్టీ భూస్థాపితం కాబోతున్నదని… ఎన్టీఆర్ శాపం ఇప్పుడు ఫలించబోతోందని మోహన్ బాబు జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా… తణుకు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో మోహన్ బాబు పాల్గొని మాట్లాడారు.
ఎన్నకల సమయంలోనే చంద్రబాబుకు డ్వాక్రా మహిళలు గుర్తుకొస్తారు. పసుపు కుంకుమ పేరుతో వాళ్ల సొమ్మలు వాళ్లకే ఇస్తున్నాడు. చంద్రబాబు, ఆయన మంత్రులు.. మట్టి, ఇసుక దోచేసి లక్షల కోట్లు సంపాదించి మరోసారి ఓటేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నాడు. మరోసారి చంద్రబాబుకు ఓటేస్తే ప్రజల రక్తాన్ని కూడా దోచేస్తాడు. సరిగ్గా మాట్లాడటం కూడా రాని తన కొడుకు లోకేశ్ కు మూడు మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం. రాష్ట్రం మొత్తం జగన్ వెంటే ఉంది. వచ్చే ఎన్నికల్లో 130 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవడం ఖాయం.. అని మోహన్ బాబు తెలిపారు.