మేమంత నీచులమా.. మా పరువు తీశారు.. స్టార్ హీరోని అరెస్ట్ చేయాలంటున్న హిజ్రాలు..!

-

కోలీవుడ్ లో ఈమధ్య చేసిన ఓ ప్రయోగాత్మక సినిమా ప్రయోగం బాగున్నా అది ప్రేక్షకులు మెచ్చి ప్రశంసలు అందుకోవడం కన్నా విమర్శలు ఎక్కువ తెచ్చుకుంటుంది. త్యాగరాజన్ కుమార్ రాజా డైరక్షన్ లో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ నటించిన సినిమా సూపర్ డీలక్స్. ఈ సినిమాలో అందరు తమ కెరియర్ లో ఎప్పుడు చేయని పాత్రలు చేశారు. విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో నటించాడు.

అయితే సినిమాలో హిజ్రాగా నటించిన విజయ్ పిల్లలను కిడ్నాప్ చేస్తాడు. దానిపై తమిళనాడులోని హిజ్రాలు గొడవ చేస్తున్నారు. హిజ్రాల మనోభావాలు దెబ్బతినేలా ఆ సన్నివేశాలు ఉన్నాయని. హిజ్రాలు ఎప్పుడు పిల్లలను కిడ్నాప్ చేయరని.. అలా చేస్తారని చూపించిన దర్శకుడుని.. ఆ పాత్ర చేసిన విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిజ్రా సంఘాలన్ని కలిసి సూపర్ డీలక్స్ సినిమాపై గొడవ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news