ఈడీ, సీబీఐ దాడుల‌కు భ‌య‌ప‌డం : సీఎం కేసీఆర్

-

వ‌రి ధాన్యం కొనుగోలు విషయంలో వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రంతో పోరాడ‌టానికి సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే కేంద్రం ప్ర‌భుత్వం చేసే.. ఈడీ, సీబీఐ దాడుల‌కు భ‌య‌ప‌డం అని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఈడీ ల‌కు బోడీ ల‌కు కేసీఆర్ భ‌య‌ప‌డ‌డ‌ని అన్నారు. స్కాంలు, దొంగ‌త‌నాలు చేసే వాళ్లుకు ఈడీ, సీబీఐ అంటే భ‌యం అన్నారు. రైతుల కోసం పోరాటం చేసు త‌మ‌కు భ‌యం లేద‌ని అన్నారు.

అలాగే పంజాబ్ రాష్ట్రంలో వ‌రి ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తున్నారో.. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే వ‌రి ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్య‌మం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కాగ తాము పోరాడుతుంది.. అమెరికా, పాకిస్థాన్ దేశాల రైతుల కోసం కాద‌ని అన్నారు. భార‌త దేశంలో అంత‌ర్భాగ‌మైన తెలంగాణ రైతుల గురించి పోరాటం చేస్తున్నామ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news