ఆర్ విత్ ఆర్ఆర్ఆర్ : రానా తో ఆర్ఆర్ఆర్ టీం ముచ్చ‌ట్లు..ఇవిగో …

-

టాలీవుడ్‌ మాత్రమే కాదు బాలీవుడ్‌ కూడా ఈడు మనోడే..అనుకోగలిగే,  అనుకునే నటుడు రానా..నవ్విస్తూ అడిగిన ప్రశ్నలు….నవ్వుతూ చెప్పిన విశేషాలు..ముంబై సముద్రతీరంలో పిల్లగాలిలా అల్లరి చేస్తూ  ఆర్‌ఆర్‌ఆర్‌ టీం తో చెప్పించిన కబుర్లు. వేద్దామా ఆ విశేషాలపై ఒక లుక్‌.

Rana Daggubati Hangs Out with RRR Team SS Rajamouli, Ram Charan and Jr NTR, See Pic

ఇప్పటిదాకా తెలుగుసినిమాకు, ఇక్కడి ఆడియెన్స్‌కు మాత్రమే పరిమితం నేను. ఒక్కసారిగా బహుభాషా సినిమా వేదికలపైకి ఎక్కడానికి, మాట్లాడటానికి, అక్కడి వారితో కలవడానికి భయపడ్డాను. కాస్త తడబడ్డాను.  కానీ ఒకసారి వెళ్లాక, మాట్లాడాక తెలిసింది. మన భారతీయులకు సినిమాపై ఉన్న క్రేజ్, మల్టీస్టారర్, పాన్‌ ఇండియన్‌ సినిమాల పట్ల, హీరోల ఫ్యాన్స్‌ చూపించే అభిమానం, ఒక ఉత్సవంలా, సంరంభంలా దానికోసం ఎదురుచూడడం, సంబరాలు చేయడం…ఇదంతా చూశాక నాకు అనిపించింది…మారేది భాష మాత్రమే….ప్రాథమికంగా సినిమాయే మనందరి భాష అని…ఈ విషయం నాకు అర్థమైనాక ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు. ఇకపైనా ఇదే కొనసాగిస్తాను. చరణ్‌ నేను ముందునుంచీ స్నేహితులం. ఈ చిత్రంలో కూడా స్నేహితులుగా కనిపించడం మా బంధాన్ని మరింత గట్టిపడేలా చేసింది. దీని ప్రభావం ఈ సినిమాలో మేం ఇంకా బాగా నటించేందుకు, సన్నివేశాలను రక్తి కట్టించేందుకు దోహదం చేసింది.. అని అన్నారు తార‌క్ .

చరణ్‌…పానీపూరి

ఇక వ్యక్తిగతంగా చరణ్‌ గురించి చెప్పమంటే అతను కాస్త ఇంట్రావర్ట్‌. తొందరగా ఎవరితోనూ కలవడు. కానీ ఆ గంభీరతను, ముభావాన్ని దాటుకుని ముందుకు వెళ్లగలిగామా ఇంక అతనితో మన స్నేహాన్ని ఏదీ ఆపలేదు. ఎవ్వరూ అడ్డుకోలేరు. సరిగ్గా  చెప్పాలంటే అతను పానీపూరి లాంటి వాడు. ఆ పానీ పూరి పెంకును పగలగొట్టి అందులో కావలిసిన దినుసులను వేసుకుని మొత్తంగా తింటే కానీ ఆ రుచి మన మనసును నింపదు. ఒకసారి తిన్నామా ఇంక వదలటం కష్టం.   అలాగే చరణ్‌ కూడా. ..అని అన్నారు తారక్ ..

తారక్‌ ఒక నాన్‌వెజ్‌ థాలీ…

ఇక తారక్‌ అయితే ఒక నాన్‌వెజ్‌ థాలీ టైపు. అందులో అన్ని పదార్థాలు ఉంటాయి. వాటిని కలిపి తినవచ్చు. విడివిడిగా తినవచ్చు. దేని రుచి దానిదే. దేని ప్రత్యేకత దానిదే. తారక్‌ది అలాంటి బహుముఖీన వ్యక్తిత్త్వం. ఇక మా ఇద్దరికీ స్నేహం ఎందుకు కుదిరిందంటే…మనకు తెలుగులో ఒక సామెత ఉంది…విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని…అదే నిజం కూడా. మేమిద్దరమే అందుకు ఉదాహరణ. స్వభావ పరంగా మేమిద్దరం..కానీ స్నేహితులుగా మేమిద్దరం ఒక్కరం.. అని అన్నారు చ‌ర‌ణ్.

RRR: NTR, Ram Charan, Rajamouli enjoys with Rana
ఇది పూర్తిగా ఫిక్షనల్‌ సినిమా. ఇద్దరు హేమాహేమీలైన వీరుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మలచిన సినిమా ఇది. వారిద్దరి జీవిత కాలాలు, పోరాటంలో అడుగిడిన సమయం, తిరిగి ఇంటికి వచ్చిన సమయం…ఆ మూడు,నాలుగేళ్లు వారద్దరి మ‌ధ్య జరిగిన సంఘటనలు….ఇలా అన్నిటి మధ్యా ఎంతో సామ్యం ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం… వీటిని గురించి విన్న కొద్దీ, తెలుసుకున్న కొద్దీ వారు ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన సమయం, ఆ సమయంలో జరిగిన సంఘటనలు, వాటిని సినిమాగా ఎలా మలచవచ్చు, తద్వారా మనం ఏం చెప్పొచ్చు ఇవే నా మనసులో తిరిగిన విషయాలు. ఇవే  నాకు ఈ సినిమాకు కథావస్తువును అందించాయి. ఆ ఇద్దరు వీరుల గురించి జనాలకు మరింతగా సినిమా రూపంలో చెప్పాలన్న తాపత్రయాన్ని పెంచాయి.. అని అన్నారు రాజ‌మౌళి.

రాజమౌళి కన్నా నేనే సీనియర్‌..

ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే నేను నేను బాలనటుడిగా రంగప్రవేశం చేశాను. అందుకే రాజమౌళి కన్నా నేనే సీనియర్‌ అంటూ నవ్వుల పువ్వులుపూయించారు తారక్‌.

జూనియర్‌ ఇప్పుడు పరిణితి చెందిన నటుడు
ఎన్టీఆర్‌ గురించి చెప్పాలంటే కెరీర్‌ మొదట్లో అన్నీ చేసేయ్యాలి, అంతా చేసెయ్యాలి అన్న మైండ్‌సెట్‌తో ఉండేవాడు. వీటిలోపడి సినిమాల ఎంపికపై పెద్దగా దృష్టి పెట్టేవాడు కాదు. తర్వాత్తర్వాత అతను సినిమాను అర్థం చేసుకున్నాడు. దానికి తగినట్టుగా తనను మార్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. మొదటి సినిమానుంచి ఇప్పటి వరకూ  అతనిలో ఎనర్జీలెవల్స్‌ మారలేదు. ఇక చరణ్‌ కూడా అంతే. చాలా హార్డ్‌వర్క్‌ చేస్తాడు. అతనిలో నాకు నచ్చిన అంశం ఏమిటంటే తనేంటి? తన ఆలోచనలేంటి ? అనేవి సెట్‌ బయటే వదిలివస్తాడు. నాకు ఎలా కావాలో అలా మారిపోతాడు. అంతే అద్భుతంగా నటిస్తాడు. ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచేది.ఒకసారి హిందీ డబ్బింగ్‌ చెప్పేటపుడు ఒక డైలాగ్‌ సరిగా పలకలేకపోతే దాదాపు 80 సార్లు ప్రాక్టీస్‌ చేసి కరెక్ట్‌గా పలికాడు. అన్నిసార్లూ ఒకటే ఆరాటం. డైలాగ్‌ సరిగా రావాలని. అదీ వర్క్‌ పట్ల అతని కమిట్‌మెంట్‌…అని చెప్పారు రాజమౌళి.

ఒక్క తారక్‌ పది ఎనర్జీ డ్రింక్స్‌ కు సమానం
రాజమౌళి….అన్‌స్టాపబుల్‌

తారక్‌ యాక్షన్‌ గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా నుంచీ అదరగొడుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ రేంజ్‌లో నటించాడు. తారక్‌ డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్, ఇలా అన్నింట్లో ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఒక్క తారక్‌ పది ఎనర్జీ డ్రింక్స్‌తో సమానం..అని చెప్పారు రాజమౌళి.‘‘రాజమౌళి ఏమీ మారలేదు. మొదటి నుంచి అతని ఆలోచనలు, సినిమాలు అన్నీ హైరేంజ్‌లోనే ఉంటాయి. అతనికి సినిమా ఆకలి ఎప్పటికీ తగ్గరదు, అందుకే అతని సినిమాలు కూడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా భారీ విజయాల్ని సాధిస్తుంటాయి. సినిమాపట్ల అతని పాషన్‌ అన్‌స్టాపబుల్‌…టోటల్‌గా అతనిది వేరే లెవెల్‌ ’’అన్నారు చరణ్‌.

యాక్షన్‌ విషయానికొస్తే…

ఈ సినిమా ట్రైలర్‌ యాక్షన్‌ జానర్‌కు సంబంధించిన అన్ని బౌండరీలను బద్దలు కొట్టింది. సినిమాలో ఎమోషన్స్‌ను చూపించడం కాదు సరిగ్గా చూపించడం వాటితో ప్రేక్షకులను కనెక్ట్‌ చేయడం ముఖ్యం.ఎమోషన్స్‌ను సరిగా చూపించలేకపోతే ఈ ఫైట్స్‌ అన్ని వ్యర్థం. అవి ప్రేక్షకులకు రీచ్‌ కావు. పులి ముఖానికి ఎదురుగా నిలబడి ఎన్టీఆర్‌ దానికి దీటుగా అరవటం మామూలుగా చూస్తే కాస్త అతిశయంగా అనిపిస్తుంది….కానీ ఆ సన్నివేశాన్ని కాస్త నిశితంగా  చూస్తే ఒక ఆవేశం…ఆగ్రహం…ఆవేదన…అన్నీ కలిసిన ఎమోషన్‌ అది అని మనకర్థం అవుతుందికనిపిస్తాయి. నా సినిమాల్లో యాక్షన్‌ అనేది కేవలం విజువల్‌ కోసం మాత్రమే కాదు. ఎమోషన్‌ను సరిగ్గా చూపించటం కోసం.. అని చెప్పారు రాజ‌మౌళి.

అంతా భారతీయనటులే…

తెలుగు…హిందీ యాక్టర్లు కాదు సినిమా పరిశ్రమలో ఉన్నవారంతా  భారతీయ నటులు…ఇలాగే అందరూ అనుకోవాలని, ఆ పేరు అలాగే స్థిరపడాలని ప్రయత్నిస్తాను. హాలీవుడ్‌ లాగా ఇది భారతీయ సినిమా అంతే ఈ సినిమాలో విదేశీ నటుల్ని నటింప చేయడం  కోసం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఈ విషయంలో శేఖర్‌కపూర్‌ నాకు సహాయం చేశారు.వారు కూడా ఇక్కడి సినిమా వాతావరణాన్ని అర్థం చేసుకుని బాగా నటించారు…అని చెప్పారు రాజ‌మౌళి.

రాజమౌళి  సినిమాల్లో ఆయుధానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కోసారి అవే పోస్టర్లు అవుతాయి. సంచలనాలను సృష్టిస్తాయి. ..ఇదే మాట రానా అడగ్గా …. సినిమా తీసేటప్పుడు ప్రేక్షకులనే మనసులో ఉంచుకుంటాను. ప్రతి విషయం పట్ల  చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. అంతే తప్ప ఇంకేమీ లేదు… అని చెప్పారు రాజ‌మౌళి.
– మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news