రాజమౌళికి డైసీ ఎడ్గర్ షాక్.. సినిమా నుండి క్విట్..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అల్లూరిగా చరణ్, కొమరం భీమ్ గా తారక్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ ను సెలెక్ట్ చేశారు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ అందరికి తెలిసిన హీరోయినే కాని డైసీ ఎడ్గర్ జోన్స్ మాత్రం బ్రిటీష్ అమ్మాయి.

సీరియల్స్ హీరోయిన్ గా నటించే అమ్మడు ఆర్.ఆర్.ఆర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకోవడం లక్కీ అని అనుకున్నారు. కాని ఆర్.ఆర్.ఆర్ ప్రస్తుతం షూటింగ్ లో డైసీ ఎడ్గర్ జోన్స్ పాల్గొనాల్సి ఉండగా ఆమె హ్యాండ్ ఇచ్చిందట. అందుకే ఆమె ప్లేస్ లో వెరొకరిని పెట్టుకోవాలని చూస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ నుండి డైసీ ఎడ్గర్ జోస్న్ క్విట్ అవడం అఫిషియన్ గా వెళ్లడించారు. మరి తారక్ జోడీగా రాజమౌళి ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news