బ్యూటీ స్పీక్స్ : అందాల నివేథా.. అరుదైన విశేషాలివి…

-

సౌత్‌ సినిమా ఇండస్ట్రీ కాస్ట్ హీరో బేస్‌ ఇండస్ట్రీ. టాలీవుడ్‌…ఇంకాస్త గ్లామర్‌ ఇండస్ట్రీ. ఇది బహిరంగ రహస్యం. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌ దీన్నే ఫాలో అవుతోంది. దీనికి ఎవరూ అతీతులు కారు. ఎవరో ఒక్కరూ అరా…తప్ప…ఎవరికీ దీన్నుంచి మినహాయింపు లేదు. ఇక్కడ సక్సెస్‌ను అందుకోవాలంటే హీరోయిన్‌కు నటన వచ్చి ఉండాలా…గ్లామర్‌గా ఉంటే చాలా ? గ్లామర్‌ ఒలికిస్తే మాత్రం చాలా? చాలామంది హీరోయిన్లు ఈ ప్రశ్నకు సమాధానంగా నిలబడితే….కొంతమంది మాత్రం దాన్ని ఎదిరించి నిలదొక్కుకున్నారు. ఒడ్డూ…పొడుగూ..ఒంపూ..సొంపూ…తళుకు..బెళుకు వీటితో తమ యాక్టింగ్‌ టాలెంట్‌ ముందు ఈ పడికట్టు పదాలేవీ నిలబడలేవని  నిరూపించారు. నివేదా థామస్‌ అలాంటి హీరోయిన్‌.

హీరోయిన్‌ అంటే గ్లామర్‌డాళ్‌ కాదని, అందం కాదు అభినయం మాత్రమే లాంగ్‌లాస్టింగ్‌ అని నిరూపించిన హీరోయిన్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో అడుగుపెట్టిందీ కేరళ అమ్మాయి. 2008లో నాని హీరోగా న‌టించిన జెంటిల్మెన్‌ సినిమాతో హిట్‌ కొట్టింది. తర్వాత వరుసగా మంచి సినిమాలు చేసింది. నిన్నుకోరి, వకీల్‌సాబ్‌ ఇలా ఏ సినిమా చేసినా అందులో నివేదా నటన హైలెట్‌.

 

వకీల్‌సాబ్‌ సినిమా తర్వాత తెలుగులో కాస్త విరామం తీసుకున్నిన నివేదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల యా..యా..యా..జై బాలయ్యా అంటూ అఖండ సినిమాలో పాటకు ఇన్ స్టా గ్రాంలో స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను మురిపించింది. తాజాగా ఆమె కొన్ని పిక్స్‌ పోస్ట్‌ చేసింది. లైట్‌ పర్పుల్‌ కలర్‌  లాంగ్‌ ఫ్రాక్‌లో ముగ్ధ మనోహరంగా ఉందీ ముద్దుగుమ్మ. ఈ పిక్స్‌కు ఫిదా అయిపోతున్నారు నెటిజన్స్‌.

తమిళ, మల‌యాళం సినిమాల్లో కూడా నటించినా తెలుగు సినిమాలతోటే ఎక్కువగా గుర్తింపు పొందింది నివేదా. తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెను ఇక్కడి అమ్మాయిగానే చూస్తారు. భావిస్తారు. తన పాత్రలకు తానే చక్కగా డబ్బింగ్‌ చెప్పుకోవడం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం నివేదా మీట్‌క్యూట్, శాకినిఢాకిని సినిమాల్లో నటిస్తున్నారు.

తమిళ, మళయాళం సినిమాల్లో కూడా నటించినా తెలుగు సినిమాలతోటే ఎక్కువగా గుర్తింపు పొందింది నివేదా. తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెను ఇక్కడి అమ్మాయిగానే చూస్తారు. భావిస్తారు. తన పాత్రలకు తానే చక్కగా డబ్బింగ్‌ చెప్పుకోవడం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం నివేదా మీట్‌క్యూట్,శాకిని..ఢాకిని సినిమాల్లో నటిస్తున్నారు.

– బ్యూటీ స్పీక్స్ – మ‌న లోకం ప్ర‌త్యేకం 

Read more RELATED
Recommended to you

Latest news