అల్లు అర్జున్, కళ్యాణ్‌ రామ్‌లకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

-

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. నగరంలో కఠినంగా రూల్స్‌ అమలు చేస్తున్నారు. కార్లుకున్న బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగిస్తూ.. జరిమానాలను విధిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ఇటీవల కాలంలో నగరంలో జరుగుతున్న కారు ప్రమాదాల నేపథ్యంలో.. ఈ చర్చలు చేపట్టారు పోలీసులు. ఇందులో భాగంగానే.. ఇవాళ సినీ నటుడు అల్లు అర్జున్ కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు షాక్‌ ఇచ్చారు.

హీరో అల్లు అర్జున్ కారుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. నిన్న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీలలో బాగంగా జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు.

అల్లు అర్జున్ కారును ఆపి.. మరీ… ఆయన కారు అద్దాలకు ఉన్న నల్ల ఫిల్మ్ లను తొలగించి 700 రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు.. అదే దారిలో వెళుతున్న మరో హీరో కల్యాణ్ రామ్ కారుకు కూడా… ఇదే తరహాలో జరిమానా విధించారు పోలీసులు. కాగా.. నాలుగు రోజుల కిందట ఎన్టీఆర్‌ కారుకు కూడా పోలీసులు ఫైన్‌ వేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news