ఎన్టీఆర్ దేవుడు…. చంద్రన్న రాముడు… నేను మాత్రం మూర్ఖున్ని: నారా లోకేష్

-

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమావేశంలో నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ దేవుడని… చంద్రన్న రాముడని… కానీ ఈ లోకేష్ మూర్ఖుడు అని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో… ఏ వైసీపీ నాయకులైతే మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో… మీ అందరికి సినిమా మొదలవబోతోందని వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరని.. మీరు అమెరికాకు వెళ్లినా, ఐవరీకోస్ట్ వెళ్లినా…నేను మాత్రం మిమ్మల్ని వెంటాడుతా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 1985లోనే మంగళగిరిలో తెలుగు దేశం జెండా ఎగిరిందని.. ఏనాడు కూడా మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదని.. ఆ చరిత్రను తిరగరాయాలంటే అది తెలుగు దేశం పార్టీ వల్లే అవుతుందని నారా లోకేష్ అన్నారు. 2024 ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి, మన రాముడు చంద్రన్నకు కానుక ఇవ్వాలని కార్యకర్తలను కోరాడు.

Read more RELATED
Recommended to you

Latest news