మాస్టర్ స్టోరి టెల్లర్ ఏ ముహుర్తాన తాను చేయబోయే మల్టీస్టారర్ మూవీకి ‘ఆర్ఆర్ఆర్’ అనే పేరు పెట్టారో తెలియదు. కానీ, ఆ పేరు పెట్టిన నాటి నుంచి ప్రతీ ఒక్కరు ఆ పేరును తెగ వాడేస్తున్నారు. చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇంకా వాడేస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ ప్రమోషన్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ పేరును వాడుతూ..నే ఉన్నారు. ఇటీవల స్కోర్ అనే కండోమ్ కంపెనీ వారు RRR పేరును కండోమ్ ప్రకటనలో యూజ్ చేశారు. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా వినూత్న రీతిలో ఆర్ఆర్ఆర్ పేరును ఉపయోగించుకుంటున్నారు.
‘రెస్పెక్ట్ రోడ్ రూల్స్’ అనే క్యాప్షన్ తో RRR పోస్టర్ ను రిలీజ్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేశారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతీ ఒక్కరు పాటించాలనే ఉద్దేశంతో ఈ మేరకు పోస్టర్ డిజైన్ చేశారు. రోడ్ సేఫ్టీ, డ్రైవింగ్ హ్యాష్ ట్యాగ్ లతో ఈ పోస్టర్ షేర్ చేయగా, చక్కటి స్పందన వస్తోంది. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ ను ఇలా కూడా ప్రమోట్ చేస్తున్నారా? అని అడుగుతుండగా , ఓ నెటిజన్ రిపేర్ రోడ్స్ రెగ్యులర్లీ అని కామెంట్ చేశాడు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ పేరుకు యమ క్రేజ్ ఏర్పడింది. ప్రతీ ఒక్కరు ఇలా తమ కంపెనీలు లేదా సంస్థల కోసం లేదా అవగాహన కోసం పేరును వాడటం వలన తమ చిత్రానికి ఇంకా పబ్లిసిటీ వస్తుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అలా ఈ చిత్రం మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేందుకు ఈ పబ్లిసిటీ ఉపయోగపడొచ్చు.
#HYDTPweBringAwareness
Respect Road Rules.#Roadsafety #safety #driving pic.twitter.com/ow2mRc0h78— Hyderabad Traffic Police (@HYDTP) March 29, 2022