ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త !

-

నిన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 11 సమస్యలపై వినతి పత్రం అందజేసారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీలు. “గ్రామీణ ఉపాధి హామీ పథకం” కింద రూ. 2828 కోట్ల నిధులు బకాయిలు విడుదల చేయాలని వినతి ఇచ్చారు. ఏపీ కి కేటాయించిన గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద మొత్తం 30 కోట్ల పని దినాలుకు పెంచాలని.. “ఉపాధి హామీ పథకం” కింద గిరిజన ప్రాంతాలలో కాఫీ ప్లాంటేషన్ పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు.

“ఉపాధి హామీ పథకం” కింద ఉద్యానవన సాగుకు మినహాయింపులు ఇవ్వాలని.. “ఉపాధి హామీ పథకం” నిధులను స్మశాన వాటికల ప్రహరీ గోడల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. “ప్రధాన మంత్రి ఆవాస యోజన” పథకం పనులకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని.. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరారు.

రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో 113 కిలోమీటర్ల రోడ్డు పనులను అదనంగా “పీఎం గ్రామీణ సడక్ యోజన” లో చేర్చాలని.. “సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన” కింద దంగేరు గ్రామానికి 324 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే వీటిపై సానుకులంగా స్పందించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్.. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news