జాతకంలో శని దోషమా.. అయితే ఈ టిప్స్ పాటించేయండి..!

-

జోతిష్యశాస్త్రం మనిషి జీవితాన్ని శాసిస్తుందనేది పండితుల మాట.. రెండు జీవితాలు ఒక్కటవ్వాలంటే.. వారి జాతకాలు కలవాల్సిందే.. లేదంటే పెళ్లి చేయడానికి వెనకాడతారు.. తప్పదంటే.. కొన్ని దోషనివారణ పూజలు చేయించి ఆపై.. పెళ్లిళ్లు చేస్తారు. సో… జోతిష్యశాస్త్రానికి అంతటి ప్రాముఖ్యత ఉంది.. మరి అలాంటిది.. ఒకవేళ ఎవరైనా వ్యక్తి జీవితంలో శని అశుభ స్థానంలో ఉంటే.. అతనికి లేదా ఆమెకు దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. శని దేవుడి దయలేదంటే… ఇక ఎంత కష్టపడినా విజయం సాధించలేరు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జాతకంలో శనికి సంబంధించిన దోషం ఉంటే అస్సలు భయపడకండి. శని దేవుడిని అనుగ్రహం పొందడానికి ఈ జ్యోతిష్య పరిహారాలని చేస్తే సరిపోతుందట.
మీరు శని దోషంతో బాధపడుతున్నట్లయితే శనివారం శని దేవాలయానికి వెళ్లి మీ బూట్లు లేదా చెప్పులు వదిలి ఇంటికి తిరిగి వచ్చేయండి. ఈ రెమెడీ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలాగే దీని గురించి ఇంకెక్కడా చర్చించకూడదు.
జాతకంలో శని సంబంధిత దోషాలను తొలగించడానికి మీ దగ్గర పనిచేసే పనివాళ్లు లేదా ఉద్యోగులు ఎవరైనా సరే.. వీలైనంత సంతోషంగా ఉంచాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మనం ఎవరికీ బూట్లు లేదా చెప్పులను బహుమతిగా ఇవ్వకూడదు. అంతేకాదు ఎవరి నుంచి అలాంటి బహుమతి తీసుకోకూడదు. మరిచిపోయి కూడా ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి.
రావిచెట్టుని ఆరాధించినా కూడా శనిదోషం పోతుంది.. శనివారం రావిచెట్టుని పూజించడం ద్వారా శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు అంటున్నారు.. శనికి సంబంధించిన అన్ని కష్టాలు త్వరగా తొలగిపోతాయట.
పూజలలో నలుపు రంగుకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఈ కారణంగా శనిదేవుడు నలుపును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడని పండితులు చెప్తారు. అప్పటి నుంచి శని దేవుడికి నలుపు రంగు వస్తువులను సమర్పించడం ప్రారంభమైంది. దీంతో శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇది కాకుండా మీరు ఎవరికైనా పేద, నిస్సహాయ లేదా ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయట.
సో.. ఇలాంటి చిట్కాల ద్వారా జాతకంలో శని దోషాన్ని తొలగించుకోవచ్చు. అయితే ఇవి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. పండితులు చెప్పిందే మీకు అందించాం తప్ప.. మనలోకం సొంతంగా కల్పించి రాసింది కాదని గమనించగలరు.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news