గూగుల్ పేతో లావాదేవీలు చేస్తున్నారా? మరో సారి ఆలోచించండి..!

-

గూగుల్ పే యాప్ పై అబిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. ఏమని అంటే.. ఈ యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందట. నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్ కు ఆర్బీఐ నుంచి ధృవీకరణ లేదట.

గూగుల్ తేజ్.. పేరు మారి గూగుల్ పే అయింది. అయితే.. ఈ పేమెంట్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కేవలం మొబైల్ నెంబర్ తెలిస్తే చాలు.. ఎదుటి వ్యక్తికి డబ్బులు పంపించవచ్చు. ఆ వ్యక్తి మొబైల్ నెంబర్ కు లింక్ అయిన అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. చాలా ఈజీ యాప్. అకౌంట్ నెంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ లాంటి జంజాటాలు ఏమీ అవసరం ఉండదు. కేవలం మొబైల్ నెంబర్ ఉంటే చాలు చిటికెలో డబ్బులు పంపించవచ్చు.

is-google-pay-official-app-to-perform-bank-transactions

అయితే.. ఈ యాప్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. కోట్లమంది యూజర్లు ఉన్న ఈ యాప్ అసలు అఫీషియల్ యాపే కాదట. అవును.. ఈ యాప్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధృవీకరించలేదట. ఈ యాప్ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో గూగుల్ పే పై అనుమానాలు మొలకెత్తడం ప్రారంభమైంది.



గూగుల్ పే యాప్ పై అబిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. ఏమని అంటే.. ఈ యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందట. నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్ కు ఆర్బీఐ నుంచి ధృవీకరణ లేదట.. ఇదే అంశాన్ని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే… ఈ ఏడాది మార్చి 20 న ఆర్బీఐ విడుదల చేసిన అఫీషియల్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ లిస్ట్ లో గూగుల్ పే పేరే లేదట.

దీనిపై దర్యాప్తు చేపట్టిన కోర్టు.. అఫీషియల్ గా ధృవీకరణ లేని గూగుల్ పే యాప్ ఎలా కార్యకలాపాలను కొనసాగిస్తోందంటూ ఆర్బీఐని ప్రశ్నించింది. ఈ పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలంటూ ఆర్బీఐ, గూగుల్ ఇండియాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news