Ap: విద్యుత్ కోతల వల్ల “ఫ్యాన్” తిరగడం లేదు.. నాగబాబు ఫన్నీ ట్వీట్..

-

ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత విద్యుత్ కోతలపై నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. వేసవి తాపం తో ఇంట్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక విద్యార్థులు, వర్క్ ఫ్రొం హోమ్ చేసే ఉద్యోగులకు నరకం కనిపిస్తుంది. గంటల తరబడి విద్యుత్ కోతలతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుంది. అసలు విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో చాలా మంది ఇన్వర్టర్లు, జనరేటర్లను అమర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో అయితే సుమారు 6 గంటల పైనే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి పై నాగబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలకు ” ఫ్యాన్” తిరగడం లేదు అంటూ తస్మదీయులు ప్రజలకి ఒక కర్ర ఇస్తే, ఆ కర్రతో అయినా ఫ్యాన్ తిప్పుకుంటారని, ఎందుకంటే ఫ్యాన్ తిరగకపోతే తస్మదీయులకు కూడా ఇబ్బందే నని ఎద్దేవా చేశారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news