తొమ్మిది నెలల గర్భం తో ఆసుపత్రికి బాలిక.. సోదరుడే ఆమెను అత్యాచారం చేయడంతో!

-

ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.ఒకే ఇంట్లో కలిసి ఉండే చెల్లెలిపై అన్నయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు.పలుమార్లు భయపెట్టి లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భవతి అయింది.బడికిి వెళ్లాల్సిన ఆ చిన్నారి కడుపులో బిడ్డను మోస్తు నరకయాతన అనుభవించింది.ఇంత చిన్న పాపకు ఇలా జరగడం ఏంటని అనుమానించిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు బయటపడ్డాయి.

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో ఓ ఎస్ టి కాలనీకి చెందిన దంపతులకు ఇద్దరు కొడుకులు.గొడవల కారణంగా కొన్ని ఏళ్ళ కిందట వారు విడిపోయారు.భార్య కొడుకుల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి మరో వివాహిత తో సంబంధం పెట్టుకున్నాడు.ఈమెకు మొదటి భర్త( వదిలేసి వెళ్లిపోయిన) ద్వారా ఓ కూతురు, కొడుకు ఉన్నారు.5 ఏళ్లకు పైగా దూరంగా ఉన్న ఈ కుటుంబాలు ఏడాది కిందటే మళ్లీ దగ్గరయ్యాయి.అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.ఈ క్రమంలో మొదటి భార్య పెద్ద కొడుకైన 20 ఏళ్ల యువకుడు వరుసకు చెల్లెలు అయ్యే బాలిక (12)పై కన్నేశాడు. ఒకే ఇంట్లో కలిసి ఉండడంతో ఆ బాలికను లోబరుచుకుని పలుమార్లు లైంగిక దాడి చేసే వాడు.

దీంతో ఆమె గర్భం దాల్చింది.చెల్లెలిపై అన్న అత్యాచారం చేస్తున్నాడు అనే విషయం కుటుంబానికి తెలిసేటప్పటికి ఆ బాలిక నాలుగు నెలల గర్భంతో ఉంది.గుడ్ో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారు.కానీ పాప కు 9 నెలలు నిండడంతో ప్రసవంకోసం హాస్పత్రికి తీసుకెళ్లక తప్పలేదు.నెల్లూరు జిల్లాలోని జీజీహెచ్ కు బాలికను తీసుకురాగా అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘటనపై తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news